Product SiteDocumentation Site

Red Hat Enterprise Linux 5

5.8 విడుదల నోట్స్

Red Hat Enterprise Linux 5.8 కొరకు విడుదల నోట్స్

సంచిక 8


చట్టబద్ద నోటీసు

Copyright © 2012 Red Hat, Inc.
The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
MySQL® is a registered trademark of MySQL AB in the United States, the European Union and other countries.
All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
 RaleighNC 27606-2072 USA
 Phone: +1 919 754 3700
 Phone: 888 733 4281
 Fax: +1 919 754 3701

సంక్షిప్తము
విడివిడి విస్తరింపు యొక్క సమ్మేళనమే Red Hat Enterprise Linux చిన్న విడుదలలు, రక్షణ మరియు బగ్ ఫిక్స్ యెర్రాటా. Red Hat Enterprise Linux 5.8 విడుదల నోట్స్ అనునది Red Hat Enterprise Linux 5 ఆపరేటింగ్ సిస్టమ్‌కు మరియు దాని అనుభందిత అనువర్తనముల కొరకు యీ చిన్న విడుదల నందు చేసిన పెద్ద మార్పులను పత్రకీకరణ చేయును. ఈ చిన్న విడుదల నందలి అన్ని మార్పులపైని విశదీకృత నోట్స్ సాంకేతిక నోట్స్ నందు అందుబాటులో వుంటాయి.

ముందుమాట
1. సంస్థాపన
2. కెర్నల్
2.1. కెర్నల్ ప్లాట్‌ఫాం విస్తరింపులు
2.2. కెర్నల్ సాధారణ విశేషణం
3. పరికర డ్రైవర్లు
3.1. నిల్వ డ్రైవర్లు
3.2. నెట్వర్కు పరికరాలు
3.3. గ్రాఫిక్ డ్రైవర్స్
4. ఫైల్ సిస్టమ్ మరియు నిల్వ నిర్వహణ
5. ధృవీకరణ మరియు యింటరాపరబిలిటి
6. ఎన్టైటిల్మెంట్
7. రక్షణ, ప్రమాణాలు మరియు ధృవీకరణ
8. క్లస్టరింగ్ మరియు హై ఎవైలబిలిటి
9. వర్చ్యులైజేషన్
9.1. Xen
9.2. KVM
9.3. SPICE
10. సాధారణ నవీకరణలు
A. పునఃవిమర్శన చరిత్ర

ముందుమాట

Red Hat Enterprise Linux 5.8 నందు అభివృద్ది చేసిన మెరుగుదలలు మరియు చేరికల గురించి విడుదల నోట్స్ అధిక స్థాయిలో వివరణను అందించును. Red Hat Enterprise Linux 5.8 కు గల అన్ని మార్పులపై విశదీకృత పత్రికీకరణ కొరకు, సాంకేతిక నోట్స్ చూడండి.

గమనిక

Red Hat Enterprise Linux 5.8 విడుదల నోట్స్ యొక్క తాజా నవీకరణ వర్షన్ కొరకు ఆన్‌లైన్ విడుదల నోట్స్ చూడండి.

అధ్యాయము 1. సంస్థాపన

IPoIB నందు సంస్థాపన
Infiniband (IPoIB) యింటర్ఫేస్ నందు IP ద్వారా Red Hat Enterprise Linux 5.8 సంస్థాపనకు తోడ్పాటును అందించును.

అధ్యాయము 2. కెర్నల్

2.1. కెర్నల్ ప్లాట్‌ఫాం విస్తరింపులు

సేవ పవర్ నిర్వహణా నాణ్యత
Red Hat Enterprise Linux 5.8 నందు సేవ పవర్ నిర్వహణా నాణ్యత (pm_qos) వ్యవస్థ కొరకు తోడ్పాటు జతచేయబడెను. ప్రస్తుతం తోడ్పాటు నీయబడుచున్న pm_qos పారామితులు: cpu_dma_latency, network_latency, network_throughput నందు వొక దాని కొరకు డ్రైవర్లు, సబ్‌సిస్టమ్స్ మరియు యూజర్ స్పేస్ అనువర్తనముల చేత పనితనపు అంచనాలను నమోదుచేయుటకు pm_qos యింటర్ఫేస్ కెర్నల్ మరియు యూజర్ మోడ్ యింటర్ఫేస్ అందించును. మరింత సమాచారం కొరకు, /usr/share/doc/kernel-doc-<VERSION>/Documentation/power/pm_qos_interface.txt చూడండి.
PCIe 3.0 తోడ్పాటు
ఐడి-ఆధారిత వరుసక్రమం, OBFF (ఆప్టిమైజ్డ్ బఫర్ ఫ్లష్/ఫిల్) చేతనం/అచేతనం తోడ్పాటు, మరియు లేటెన్సీ టాలరెన్స్ నివేదీకరణ చేతనం/అచేతనం తోడ్పాటు జతచేయుట ద్వారా Red Hat Enterprise Linux 5.8 అనునది PCIe 3.0 పూర్తి ఫంక్షన్ అందించును.
ALSA HD ఆడియో తోడ్పాటు
Intel యొక్క తరువాతి ప్లాట్‌ఫాం కంట్రోలర్ హబ్ పైన ALSA HD ఆడియో కొరకు తోడ్పాటు జతచేయబడెను.
పరికర ఐడిలు జతచేయబడెను
కింది డ్రైవర్ల కొరకు Intel యొక్క తరువాతి ప్లాట్‌ఫాం కంట్రోలర్ హబ్ పూర్తి తోడ్పాటును అందించుటకు పరికర ఐడిలు జతచేయబడెను: SATA, SMBus, USB, Audio, Watchdog, I2C.
StarTech PEX1P
StarTech 1 Port PCI Express పార్లల్ పోర్ట్ పరికరం కొరకు తోడ్పాటు జతచేయబడెను.
configure-pe RTAS కాల్
PowerPC ప్లాట్‌ఫాం పైన configure-pe RTAS (రన్‌టైమ్ అబ్‌స్ట్రాక్షన్ సేవల) కాల్ కొరకు తోడ్పాటు జతచేయబడెను.
నవీకృత JSM డ్రైవర్
IBM POWER7 సిస్టమ్స్ పై Bell2 PLX chip తో) 2-port యెడాప్టర్ తోడ్పాటును అందించుటకు JSM డ్రైవర్ నవీకరించబడెను. అదనంగా, EEH తోడ్పాటు JSM డ్రైవర్‌కు జతచేయబడెను.

2.2. కెర్నల్ సాధారణ విశేషణం

RSS మరియు swap పరిమాణ సమాచారం
Red Hat Enterprise Linux 5.8 నందు, /proc/sysvipc/shm ఫైలు (యిది వినియోగంలో వున్న భాగస్వామ్య మెమొరీ జాబితాను అందించును) యిప్పుడు RSS (రెసిడెంట్ సెట్ సైజ్—మెమొరీ నందు వుండు ప్రోసెస్ యొక్క భాగము) మరియు swap పరిమాణం సమాచారం కలిగివుండును.
OProfile తోడ్పాటు
అన్ని కోర్ యీవెంట్స్ (ప్రిసైజ్ యీవెంట్-బేస్డ్ సాంప్లింగ్ తప్పించి) తోడ్పాటు అందించుట ద్వారా Intel యొక్క సాండీ బ్రిడ్జ్ ప్లాట్‌ఫాంపై OProfile ప్రొఫైల్ కొరకు తోడ్పాటు జతచేయబడెను.
Wacom Bamboo MTE-450A
Red Hat Enterprise Linux 5.8 అనునది Wacom Bamboo MTE-450A టాబ్లెట్ కొరకు తోడ్పాటు అందించును.
X-keys Jog మరియు Shuttle Pro
X-keys Jog మరియు Shuttle Pro పరికరం కొరకు తోడ్పాటు Red Hat Enterprise Linux 5.8 కు జతచేయబడెను.
NICs కొరకు బాండింగ్ మాడ్యూల్ అన్ని వేగాలను అనుమతించును
ఏ నెట్వర్కు యింటర్ఫేసు కంట్రోలర్‌కైనా కెర్నల్ నందలి బాండింగ్ మాడ్యూల్ యిప్పుడు ప్రస్తుత లింక్-వేగాన్ని నివేదించును. గతంలో, బాండింగ్ మాడ్యూల్ 10/100/1000/10000 వేగాలను మాత్రమే నివేదించేవి. బ్లేడ్ యెన్‌క్లోజర్ పరిసరాలనందు లింక్-వేగం యొక్క ఖచ్చితమైన నివేదీకరణను యీ మార్పు అందించును అది 9 Gbs వంటి అప్రామాణిక వేగాలను వుపయోగించవచ్చు.
అనుమతించదగ్గ సీరియల్ యింటర్ఫేసుల గరిష్ట సంఖ్య
కెర్నల్ చేత తోడ్పాటు అందించబడు సీరియల్ యింటర్ఫేసెస్ యొక్క గరిష్ట సంఖ్యను CONFIG_SERIAL_8250_NR_UARTS పారామితి నిర్వచించును. Red Hat Enterprise Linux 5.8 నందు, 32 (మరియు 64 వరకు) కన్సోల్ అనుసంధానాల కన్నా యెక్కువ వున్న సిస్టమ్స్ కొరకు CONFIG_SERIAL_8250_NR_UARTS పారామితి యొక్క విలువ 64 కు పెంచబడెను.
/etc/kdump.conf నందు blacklist ఐచ్చికం
blacklist ఐచ్చికం యిప్పుడు Kdump ఆకృతీకరణ కొరకు అందుబాటులో వుంటుంది. ఈ ఐచ్చికం మాడ్యూళ్ళను initramfs నందు లోడవుటనుండి ఆపును. మరింత సమాచారం కొరకు, kdump.conf(5) మాన్యువల్ పేజీ చూడండి.
Kdump initrd నందు fnic మరియు iscsi తోడ్పాటు
fnic మరియు iscsi డ్రైవర్ల తోడ్పాటు Kdump యొక్క ప్రాధమిక RAM డిస్కు నందు జతచేయబడెను (initrd).
Xen HVM గెస్టులపై Kdump
Red Hat Enterprise Linux 5.8 నందు Xen HVM అతిథులపై Kdump సాంకేతిక మునుజూపు వలె చేతనంచేయబడెను. Intel CPU తో Intel 64 Hypervisor వుపయోగించి స్థానిక డంప్‌ను యెమ్యులేటెడ్ (IDE) డిస్కునకు జరుపుట మాత్రమే తోడ్పాటునిచ్చు యింప్లిమెంటేషన్. డంప్ లక్ష్యము తప్పక /etc/kdump.conf ఫైలు నందు తెలుపవలెనని గమనించండి.

అధ్యాయము 3. పరికర డ్రైవర్లు

3.1. నిల్వ డ్రైవర్లు

  • The ipr driver for IBM Power Linux RAID SCSI HBAs has been updated to enable SAS VRAID functions and add definitions for new adapters.
  • megaraid డ్రైవర్ వర్షన్ 5.40 కు నవీకరించబడెను, డీగ్రేడెడ్ RAID 1 తో పనిచేయుటకు FastPath I/O కొరకు పరిష్కారాన్ని అందించును.
  • Intel పాంథర్ పాయింట్ పరికర ఐడిల కొరకు AHCI (అడ్వాన్సుడ్ హోస్ట్ కంట్రోలర్ యింటర్ఫేస్) రీతి జతచేయుటకు పాంథర్ పాయింట్ PCH డ్రైవర్ నవీకరించబడెను.
  • qla2xxx 4G మరియు 8G డ్రైవర్ ఫర్మువేర్ వర్షన్ 5.06.01 కు నవీకరించబడెను.
  • QLogic ఫైబర్ చానల్ HBAల కొరకు qla2xxx డ్రైవర్ వర్షన్ 8.03.07.09.05.08-k కు నవీకరించబడెను, వైఫల్యం సంభవించినప్పుడు డంప్‌ను (మినీడంప్‌ను) కాప్చర్ చేయుటకు ISP82xx కొరకు తోడ్పాటును అందించును.
  • qla4xxx డ్రైవర్ వర్షన్ 5.02.04.00.05.08-d0 కు నవీకరించబడెను.
  • Emulex ఫైబర్ చానల్ హోస్ట్ బస్ యెడాప్టర్స్ కొరకు lpfc డ్రైవర్ వర్షన్ 8.2.0.108.1p కు నవీకరించబడెను.
  • cciss డ్రైవర్ అనునది సరికొత్త వర్షన్‌కు నవీకరించబడెను, CCISS సింపుల్ మోడ్ కొరకు తోడ్పాటును అందించుటకు కమాండ్ లైన్ స్విచ్ అందించును.
  • pci_disable పరికరం ఐచ్చికం మరియు షట్‌డౌన్ రొటీన్‌కు తోడ్పాటు నిచ్చుటకు ServerEngines BladeEngine 2 Open iSCSI పరికరముల కొరకు be2iscsi డ్రవైర్ నవీకరించబడెను.
  • Broadcom NetXtreme II iSCSI కొరకు bnx2i డ్రైవర్ 2.7.0.3 వర్షన్‌కు నవీకరించబడెను.
  • విశదీకృత SCSI I/O దోషములను జతచేయుటకు కెర్నల్ మల్టీపాత్ డ్రైవర్ నవీకరించబడెను.
  • bfa ఫర్మువేర్ వర్షన్ 3.0.2.2 కు నవీకరించబడెను.
  • కింది విస్తరింపులను చేర్చుటకు bfa డ్రైవర్ నవీకరించబడెను:
    • ఫ్లాష్ విభజనల యొక్క ఆకృతీకరణ కొరకు తోడ్పాటు.
    • fcport గణాంకాలను సేకరించుటకు మరియు తిరిగివుంచుటకు తోడ్పాటు.
    • I/O ప్రొఫైలింగ్ కొరకు తోడ్పాటు.
    • RME ఆటంకం సంభాలించుట నవీకరించబడెను.
    • FC-ట్రాన్సుపోర్ట్ యెసింక్రొనస్ ఘటనా ప్రకటన కొరకు తోడ్పాటు.
    • PHYsical లేయర్ కంట్రోల్ (PHY) క్వరీయింగ్ కొరకు తోడ్పాటు.
    • హోస్ట్ బస్ యెడాప్టర్స్ (HBA) డయాగ్నొస్టిక్స్ కొరకు తోడ్పాటు.
    • స్మాల్ ఫ్రమ్ ఫాక్టర్ (SFP) సమాచారం పొందుటకు తోడ్పాటు.
    • CEE సమాచారం మరియు గణాంకాల క్వరీయింగ్ కొరకు తోడ్పాటు.
    • ఫాబ్రిక్ ఎస్సైన్‌డ్ అడ్రస్ (FAA) కొరకు తోడ్పాటు.
    • driver/fw గణాంకాలను సేకరించుటకు మరియు adapter/ioc చేతన/అచేతన చర్యలను జరుపుటకు తోడ్పాటు.
  • mpt2sas డ్రైవర్ వర్షన్ 09.100.00.00 కు నవీకరించబడెను, అది వినియోగదారి ప్రత్యేక బ్రాండింగ్ కొరకు తోడ్పాటును జతచేయును.
  • mptsas డ్రైవర్ వర్షన్ 3.04.20rhకు నవీకరించబడెను.
  • స్టేట్ మిషన్ యింటర్ఫేస్‌కు టైప్ సేఫ్టీను జతచేయుటకు మరియు యింటెల్ యొక్క తరువాతి చిప్‌సెట్‌ కొరకు తోడ్పాటును జతచేయుటకు isci డ్రైవర్ నవీకరించబడెను.
  • iscsi-initiator-utils ప్యాకేజీ నవీకరణలో భాగంగా uIP డ్రైవర్ వర్షన్ 0.7.0.12కు నవీకరించబడెను.
  • megaraid_sas డ్రైవర్ అనునది వర్షన్ 5.40-rh1 కు నవీకరించబడెను.

3.2. నెట్వర్కు పరికరాలు

  • bnx2x డ్రైవర్ ఫర్మువేర్ వర్షన్ 7.0.23 కు నవీకరించబడెను, యిది కొత్త Broadcom 578xx చిప్సునకు తోడ్పాటు అందించును.
  • bnx2x డ్రైవర్ వర్షన్ 1.70.x కు నవీకరించబడెను.
  • bnx2i డ్రైవర్ వర్షన్ 2.7.0.3+ కు నవీకరించబడెను.
  • bnx2 డ్రైవర్ వర్షన్ 2.1.11 కు నవీకరించబడెను.
  • cnic డ్రైవర్ వర్షన్ 2.5.3+ కు నవీకరించబడెను.
  • నెట్వర్కు పరికరాల Chelsio T3 ఫ్యామిలీ కొరకు cxgb3 డ్రైవర్ అనునది సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
  • Chelsio Terminator4 10G యూనిఫైడ్ వైర్ నెట్వర్క్ కంట్రోలర్స్ కొరకు cxgb4 డ్రైవర్ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
  • iw_cxgb4 డ్రైవర్ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
  • netxen_nic డ్రైవర్ వర్షన్ 4.0.77 కు నవీకరించబడెను, అది VLAN RX HW ఏగ్జలరేషన్ కొరకు తోడ్పాటును జతచేయును.
  • tg3 డ్రైవర్ అనునది Broadcom Tigon3 ఈథర్నెట్ పరికరాల కొరకు 3.119 వర్షన్‌కు నవీకరించబడెను.
  • ixgbe డ్రైవర్ అనునది Intel 10 Gigabit PCI ఎక్సుప్రెస్ నెట్వర్కు పరికరాల కొరకు అప్‌స్ట్రీమ్ వర్షన్ 3.4.8-k కు నవీకరించబడెను.
  • ixgbevf డ్రైవర్ అప్‌స్ట్రీమ్ వర్షన్ 2.1.0-k కు నవీకరించబడెను.
  • igbvf డ్రైవర్ అనునది సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
  • igb డ్రైవర్ అనునది Intel గిగాబిట్ ఈథర్నెట్ యెడాప్టర్స్ కొరకు సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను, యిది యెన్ట్రోపి తోడ్పాటును జతచేయును.
  • e1000e డ్రైవర్ అనునది Intel 82563/6/7, 82571/2/3/4/7/8/9, మరియు 82583 PCI-E కంట్రోలర్స్ ఫ్యామిలీ కొరకు 1.4.4 వర్షన్‌కు నవీకరించబడెను.
  • e1000 డ్రైవర్ అనునది Intel PRO/1000 PCI మరియు PCI-X యెడాప్టర్స్ ఫ్యామిలీ కొరకు సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
  • bna డ్రైవర్ వర్షన్ 3.0.2.2 కు నవీకరించబడెను, అది Brocade 1860 AnyIO ఫాబ్రిక్ యెడాప్టర్ కొరకు తోడ్పాటును అందించును.
  • qlge డ్రైవర్ అనునది వర్షన్ 1.00.00.29 కు నవీకరించబడెను.
  • qlcnic డ్రైవర్ అనునది HP NC-Series QLogic 10 Gigabit సర్వర్ యెడాప్టర్స్ కొరకు వర్షన్ 5.0.18 కు నవీకరించబడెను.
  • be2net డ్రైవర్ అనునది ServerEngines BladeEngine2 10Gbps నెట్వర్క్ పరికరాల కొరకు సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
  • enic డ్రైవర్ అనునది Cisco 10G ఈథర్నెట్ పరికరాల కొరకు వర్షన్ 2.1.1.24 కు నవీకరించబడెను.
  • వాడుకరి-అమర్చదగ్గ గడువుసమయం (NBD_SET_TIMEOUT) ను I/O ఆపరేషన్స్ కొరకు జతచేయుటకు nbd డ్రైవర్ నవీకరించబడెను.

3.3. గ్రాఫిక్ డ్రైవర్స్

  • Ironlake యింటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ తో Westmere చిప్‌సెట్స్ కొరకు వివిధ బగ్‌లను పరిష్కరించుటకు Intel యొక్క i810 గ్రాఫిక్స్ డ్రైవర్ (xorg-x11-drv-i810 ప్యాకేజీ ద్వారా అందించబడిన) నవీకరించబడెను.
  • ServerEngines Pilot 3 (Kronos 3) చిప్స్ కొరకు పూర్తి పరిష్కార తోడ్పాటును అందించుటకు Matrox mga వీడియో కార్డ్ డ్రైవర్ నవీకరించబడెను.

అధ్యాయము 4. ఫైల్ సిస్టమ్ మరియు నిల్వ నిర్వహణ

CLVM మిర్రర్డ్ వాల్యూమ్ పొడిగింత కొరకు --nosync ఐచ్చికం
మిర్రర్డ్ లాజికల్ వాల్యూమ్స్ విస్తరింపుట కొరకు క్లస్టర్డ్ LVM అనునది కొత్త --nosync ఐచ్చికం చేర్చును. --nosync ఐచ్చికం తెలిపినప్పుడు, పొడిగింత తరువాత క్లస్టర్డ్ మిర్రర్డ్ లాజికల్ వాల్యూమ్ విస్తరింపచేయుట వాల్యూమ్ సింక్రొనైజ్ అగుటకు కారణంకాదు, ఖాళీ డాటా యొక్క రిసోర్స్ యింటెన్సివ్ సింక్రొనైజేషన్‌ను వదిలివేయును.
ext4 స్వయంచాలక పునః-పరిమాణీకరణ
-r/--resizefs ఐచ్చికంతో lvextend ఆదేశంను యెగ్జిక్యూట్ చేసిన తరువాత, ext4 ఫైల్ సిస్టమ్ స్వయంచాలకంగా పునః-పరిమాణం చెందును. resize2fs తో మానవీయంగా పునః-పరిమాణం చేయుట యికపై అవసరం లేదు.
NFS క్లైంట్ల చేత సురక్షితం కాని పోర్ట్స్ వుపయోగించబడెను
Red Hat Enterprise Linux 5.8 తో, NFS క్లైంట్లు సురక్షితం కాని పోర్టులు వుపయోగించుటకు అనుమతించబడును (అనగా, 1024 మరియు ఆపైని).
LVM చేత క్రియాశీల మల్టీపాత్ పరికరాలు స్కాన్‌చేయబడలేదు
LVM మల్టీపాత్ మెంబర్ పరికరాలు (క్రియాశీల మల్టీపాత్ పరికరాల కొరకు పాత్‌లు) యికపై స్కాన్ చేయదు మరియు పై స్థాయి పరికరాలను యిష్టపడును. /etc/lvm/lvm.conf నందు multipath_component_detection ఐచ్చికం వుపయోగించుట ద్వారా యీ ప్రవర్తనను ఆపి చేయవచ్చు.

అధ్యాయము 5. ధృవీకరణ మరియు యింటరాపరబిలిటి

DNS SRV రికార్డుల కొరకు తోడ్పాటు
DNS SRV రికార్డ్ తోడ్పాటు nss_ldap ప్యాకేజీనకు జతచేయబడెను.
పేజ్‌డ్ LDAP లుక్-అప్స్ కొరకు తోడ్పాటు
ఒంటరి అభ్యర్ధన ద్వారా తిప్పియివ్వబడిన పెద్ద సంఖ్యలో రికార్డులను సంభాలించుటకు SSSD అనునది పేజ్‌డ్ LDAP లుక్-అప్‌ను జరుపగలదు.
కొత్త SSSD ఆకృతీకరణ ఐచ్చికాలు
Red Hat Enterprise Linux 5.8 నందు, /etc/sssd/sssd.conf ఫైలు నందు SSSD అనునది కింది కొత్త ఆకృతీకరణ ఐచ్చికాలకు తోడ్పాటునిచ్చును:
  • override_homedir
  • allowed_shells
  • vetoed_shells
  • shell_fallback
  • override_gid
ఈ ఐచ్చికాల గురించి మరింత సమాచారం కొరకు, sssd.conf(5) మాన్యువల్ పేజీ చూడండి.

అధ్యాయము 6. ఎన్టైటిల్మెంట్

RHN Classic selected by default
When registering a system with firstboot, the RHN Classic option is checked by default in the Subscription part.
సబ్‌స్క్రిప్షన్ పొడిగింపు తరువాత ధృవీకరణపత్రం యొక్క స్వయంచాలక పునఃవుద్భవన
ఒక సబ్‌స్క్రిప్షన్ యొక్క పొడిగింపు తరువాత కొత్త యెన్టైటిల్మెంట్ ధృవీకరణపత్రాలను స్వయంచాలకంగా పునఃవుద్భవన చేయుట యిప్పుడు సాధ్యమే. ఈ విస్తరణ జరుగక మునుపు, వినియోగదారులు సాఫ్టువేర్ నవీకరణలను మరియు యితర సబ్‌స్క్రిప్షన్ సేవలను పొందుటకు ధృవీకరణపత్రమును మానవీయంగా పునఃవుద్భవన చేయవలసివుండేది. ధృవీకరణపత్రమును స్వయంచాలకంగా పునఃవుద్భవన చేయటమనేది సేవా అటంకాలను తగ్గిస్తుంది. ధృవీకరణపత్రాల స్వయంచాలక పునఃవుద్భవన కూడా విజయవంతం కాని సందర్భాలను వాడుకరులు గుర్తించారు. మరింత సమాచారం కొరకు, https://www.redhat.com/rhel/renew/faqs/ చూడండి.
సబ్‌స్క్రిప్షన్ల పేర్పు
Red Hat Enterprise Linux 5.8 adds support for subscription stacking. This allows users to combine a set of subscriptions on a single machine in order to become compliant. For more information on subscription stacking, refer to the Red Hat Enterprise Linux 5 Deployment Guide.
RHN క్లాసిక్ నుండి ధృవీకరణపత్ర-ఆధారిత RHNకు మైగ్రేషన్
Red Hat Enterprise Linux 5.8 includes a new tool to migrate RHN Classic customers to the certificate-based RHN. For more information, refer to the Red Hat Enterprise Linux 5 Deployment Guide.

అధ్యాయము 7. రక్షణ, ప్రమాణాలు మరియు ధృవీకరణ

SCAP 1.1
SCAP 1.1 (సెక్యూరిటీ కాంటెంట్ ఆటోమేషన్ ప్రొటోకాల్) ఫంక్షనాలిటీ కొరకు OpenSCAP నవీకరించబడెను.
openssl కు DigiCert ధృవీకరణపత్రం జతచేయబడెను
Red Hat Enterprise Linux 5.8 తో, openssl ప్యాకేజీ అనునది DigiCert ధృవీకరణపత్రంను /etc/pki/tls/certs/ca-bundle.crt ఫైలు నందు (యిది నమ్మదగిన root CA ధృవీకరణపత్రాలను కలిగివుండును) కలిగివుండును.

అధ్యాయము 8. క్లస్టరింగ్ మరియు హై ఎవైలబిలిటి

హై ఎవైలబిలిటి మరియు రెజిలియంట్ స్టోరేజ్ చానల్స్ నుండి ప్యాకేజీలను సంస్థాపించుట
Red Hat Enterprise Linux 5.8 బీటా సిస్టమ్‌పైన, cluster మరియు cluster-storage ప్యాకేజీలను cdn.redhat.com నుండి సంస్థాపించుట సంభందిత వుత్పత్తుల నందు ఫలితాన్నిచ్చును, High Availability మరియు Resilient Storage, యింకా సంస్థాపించి లేనట్లు గుర్తుంచబడుతోంది. cluster మరియు cluster-storage నుండి ప్యాకేజీలను సంస్థాపించుటకు, సంస్థాపనా సమయమునందు సబ్‌స్క్రిప్షన్ సంఖ్యను అందించి, Red Hat Enterprise Linux 5.8 బీటా సంస్థాపనా మాధ్యమం వుపయోగించుటకు Red Hat సిఫార్స్ చేస్తుంది. సబ్‌స్క్రిప్షన్ సంఖ్యల గురించి మరింత సమాచారం కొరకు, వీటినే సంస్థాపనా సంఖ్యలు అనికూడా అందురు, కింది KBase వ్యాసాన్ని చూడండి.

అధ్యాయము 9. వర్చ్యులైజేషన్

9.1. Xen

హోస్ట్ CD-ROM ను PV గెస్టునకు అనుభందించుట
వర్చ్యువల్ బ్లాక్ పరికరము వలె అతిథేయ CD-ROM ను పారావర్చ్యులైజ్డ్ అతిథికు అనుభందించుటకు తోడ్పాటు మెరుగుపరచడమైంది.
అతిథి VBDల గతిక పునః-పరిమాణీకరణ
Red Hat Enterprise Linux 5.8 నందు, అతిథేయ-వైపుని బ్యాకింగ్ పరికరాల యొక్క యే ఆన్-లైన్ పునః-పరిమాణీకరణ నైనా Xen అతిథులనందలి వర్చ్యువల్ బ్లాక్ పరికరాలు ప్రతిబింబింపచేయును.

9.2. KVM

SPICE QXL drivers added to virtio-win
To enable simple installation and updating of drivers without requiring an MSI installer to be run, SPICE QXL drivers have been added to the virtio-win RPM package.

9.3. SPICE

కొత్త pixman ప్యాకేజీ
Red Hat Enterprise Linux 5.8 కొత్త pixman ప్యాకేజీను కలిగివుండును అది తక్కువ-స్థాయి పిగ్జెల్ మానిప్యులేషన్ లైబ్రరీ అందించును మరియు యిమేజ్ కంపోజిటింగ్ మరియు ట్రేప్‌జోయిట్ రేస్టరైజేషన్‌ వంటి విశేషణాలను అందించును. pixman ప్యాకేజీ అనునది spice-client ప్యాకేజీ యొక్క అధారము వలె జతచేయబడెను.

అధ్యాయము 10. సాధారణ నవీకరణలు

మెరుగైన PDF/A తోడ్పాటు
PDF/A కొరకు Red Hat Enterprise Linux 5.8 మెరుగైన తోడ్పాటు కలిగివుండును—పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ యొక్క ISO-ప్రామాణీకృత వర్షన్—GhostScript వర్షన్ 9.01 కు నవీకరించుట ద్వారా.
httpd కొరకు connectiontimeout పారామితి
బ్యాక్-యెండ్ కు అనుసంధానం సృష్టించుట పూర్తిచేయుటకు సేవ యెంతసేపు వేచివుండాలో తెలుపుటకు httpd సేవ కొత్త connectiontimout పారామితిని కలిగివుండును. ఈ పారామితిని తెలుపుటచే, అపాచీ ద్వారా లోడ్ బాలెన్సింగ్‌ను వుపయోగించునప్పుడు క్లైంట్‌నకు యిచ్చే గడువుముగింపు దోషాల సంఖ్య బాగా తగ్గించబడెను.
iptables reload ఐచ్చికం
iptables సేవలు యిప్పుడు reload ఐచ్చికం చేర్చును అవి iptables నియమాలను యే మాడ్యూళ్ళను అన్‌లోడింగ్/రీలోడింగ్ చేయకుండా మరియు యిప్పటికే-వున్న అనుసంధానాలను కోల్పోకుండా తాజా(రీఫ్రెష్) పరచును.
RPM కొరకు xz తోడ్పాటు
Red Hat Enterprise Linux 5.8 నందు, LZMA ఎన్క్రిప్షన్ వుపయోగించు ప్యాకేజీల కంప్రెషన్/డికంప్రెషన్ సంభాలించుటకు RPM xz ప్యాకేజీ వుపయోగించును.
python-ctypes ప్యాకేజీ
Red Hat Enterprise Linux 5.8 కొత్త python-ctypes ప్యాకేజీ జతచేయును. python-ctypes అనునది పైథాన్ మాడ్యూల్ అది C డాటా టైప్స్ ను పైథాన్ నందు సృష్టించి మరియు మానిప్యులేట్ చేయును, మరియు డైనమిక్ లింక్ లైబ్రరీలు (DLLs) లేదా షేర్‌డ్ లైబ్రరీల నందలి ఫంక్షన్లను కాల్‌చేయును. అది యీ లైబ్రరీల యొక్క వ్రాపింగ్‌ను స్వచ్ఛమైన పైథాన్‌నందు అనుమతించును. ఈ ప్యాకేజీ iotop సౌలభ్యం యొక్క ఆధారం వలె సేవచేయును.
unixOBDC యొక్క 64-bit వర్షన్
Red Hat Enterprise Linux 5.8 కు unixODBC64 ప్యాకేజీ ద్వారా unixODBC యొక్క కొత్త 64-బిట్ వర్షన్ జతచేయబడెను. unixODBC64 ప్యాకేజీతో సహా, ఫలానా డాటాబేస్ తోడ్పాటును అందించు రెండు ప్యాకేజీలు జతచేయబడెను: mysql-connector-odbc64 మరియు postgresql-odbc64. మూడో-వ్యక్తి ODBC డ్రైవర్సుతో యింటరాపరేట్ కావలసిన వాడుకరులు unixODBC64 ప్యాకేజీను సంస్థాపించమని సూచించడమైంది, మరియు అవసరమైతే postgresql-odbc64 మరియు/లేదా mysql-connector-odbc64 ప్యాకేజీలను సంస్థాపించు.
iotop సౌలభ్యం
కొత్త iotop సౌలభ్యం జతచేయబడెను. iotop అనునది top సౌలభ్యమునకు సమానమైన వాడుకరి యింటర్ఫేస్‌తోని పైథాన్ ప్రోగ్రామ్, మరియు నడుస్తున్న ప్రోసెసెస్‌కు వరుస I/O ఆపరేషన్ గణాంకాలను చూపును.
BD-capable gcc44 కొరకు binutils
Red Hat Enterprise Linux 5.8 కొత్త binutils220 ప్యాకేజీ అందించును, gcc44 తో కంపైల్ అగునప్పుడు BD సూచనలను వుపయోగించగల సామర్థ్యం గలది. AMD బుల్డోజర్ CPU విశేషణాల యొక్క ప్రయోజనాలను తీసుకొనే ప్రోగ్రామ్సును బుల్డ్ చేయుటకు వాడుకరులను చేతనం చేయును.
ఒక నవీకరణ తరువాత httpd సేవ పునఃప్రారంభమగును
httpd ప్యాకేజీ నవీకరించిన తరువాత httpd సేవ స్వయంచాలకంగా పునఃప్రారంభమగును.
కేర్బరోస్ నెగోషియేషన్ కొరకు కర్ల్ తోడ్పాటు
రిమోట్ మిషన్లతో సంప్రదించుటకు కేర్బరోస్ ధృవీకరణను వుపయోగించుటకు curl సౌలభ్యం యిప్పుడు నెగోషియేట్ ప్రోక్సీ తోడ్పాటును చేర్చును.
vsftpd కొరకు ssl_request_cert ఐచ్చికం
vsftpd ప్యాకేజీ యిప్పుడు ssl_request_cert ఐచ్చికం చేర్చును అది క్లైట్ ధృవీకరణపత్రం పరిశీలనలను అచేతనపరచుటకు అనుమతించును. ఒకవేళ చేతనమైతే, vsftpd వొక ధృవీకరణపత్రంను లోనికివచ్చు SSL అనుసంధానములపై అభ్యర్థించును (అయితే తప్పనిసరికాదు). ఈ ఐచ్చికము కొరకు అప్రమేయ అమరిక (/etc/vsftpd/vsftpd.conf ఫైలు నందు) Yes.
hwdata ప్యాకేజీ నందు పరికర ఐడిలు జతచేయబడెను
హార్డువేర్ గుర్తింపు మరియు ఆకృతీకరణ డాటా ను యాక్సెస్ చేయుటకు మరియు ప్రదర్శించుటకు hwdata ప్యాకేజీ సాధనములను కలిగివుంటుంది. కింది హార్డువేర్ కొరకు పరికర ఐడిలు జతచేయబడెను:
  • Intel Core i3, i5, i7 మరియు యితర ప్రోసెసర్స్ ముందుగా "Sandy Bridge" కోడ్ చేయబడివుంటాయి
  • సరికొత్త HP యింటిగ్రేటెడ్ లైట్స్-అవుట్ 4 (iLO) పరికరాలు
  • Atheros 3x3 a/g/n (Madeira) వైర్‌లెస్ LAN

పునఃవిమర్శన చరిత్ర

పునఃపరిశీలన చరిత్ర
పునఃపరిశీలన 1-0Thu Feb 16 2011Martin Prpič
Release of the Red Hat Enterprise Linux 5.8 Release Notes